టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ మార్పులు, వాటి పరిణామాలపై జరిగిన సదస్సులో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రపంచంలోని 40 దేశాలకు చెందిన పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గ్రీన్ జోన్లలో మరింత పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాలు తదితర అంశాలపై చర్చలు జరిగాయి.