కలికిరి మండలం వీర్లవాండ్లపల్లికి చెందిన హరినాథ్ (47) ఈనెల 2వ తేదీ నుంచి కనపడకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారించగా. హరినాథ్ ను కలికిరికి చెందిన అల్లాబకషు, మహమ్మద్ అలీ తీసుకువెళ్లి కొబ్బరి చెట్టు ఎక్కించారు. చెట్టు నుంచి అతను జారిపడి మృతి చెందాడు. వారు భయపడి ఆటోలో మృతదేహాన్ని తెచ్చి పుంగనూరు నియోజకవర్గం సదుం సమీపంలో ఉన్న ఓ ప్రాజెక్టు వద్ద పడవేశారు.