సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపధ్యంలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇది మంచి ప్రభుత్వం పేరుతో సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. గుర్రంకొండ పట్టణంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.