సహజీవనంలో వచ్చిన వివాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం జరిగింది. పలమనేరు పట్టణంలోని లక్ష్మి నగర్ కాలనీలో జరిగిన హత్య ఉదంతం ఇది. సీఐ చంద్రశేఖర్ వివరాల మేరకు, మేస్త్రి పని చేసే మొగిలీశ్వర్ తన భార్య, పిల్లలతో గొడవ పడి మంగమ్మతో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడనీ తెలిపారు. మద్యం తాగి మంగమ్మతో గొడవ పడగా, ఆమె చాకుతో మొగిలీశ్వర్ను పొడవగా అక్కడికక్కడే చనిపోయాడనీ స్పష్టం చేశారు.