నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీలో 3 ఏళ్ల బాలిక హత్యాచార ఘటనపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారిని అత్యాచారం చేసి చంపేసిన వ్యక్తిని అత్యంత కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్ లో మాట్లాడారు.