నగరి పోస్ట్ ఆఫీస్లో తపాలా వారోత్సవాలు ముగింపు సందర్భంగా, సూపర్డెంట్ ఆఫ్ పోస్టల్ వసంత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె ఎస్బి, ఆర్డీ, టిడి, ఎస్ఎస్ఏ, ఆర్పీ ఎల్ ఐ, పి ఎల్ ఐ వంటి స్కీముల గురించి వివరించారు. తడుకుపేటలో ఆర్పీ ఎల్ఐ ఇన్సూరెన్స్ పొందిన వినియోగదారుడు కేవలం రెండు వాయిదాలు చెల్లించి మరణించడంతో 427065 రూపాయలు అతని భార్య జ్యోతికు అందించారు. ఈ స్కీములను ప్రజల్లో ప్రోత్సహించాలని వసంత కోరారు