మదనపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం అన్నమయ్య జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుండి వచ్చే అర్జీలు, భూముల సమస్యలు, జాతీయ రహదారి పెండింగ్ పనులపై సమీక్షించి వాటిని త్వరలో పరిష్కరించాలని సూచించారు. కోమటి చెరువును సందర్శించి అధికారులకు తగు సూచనలు అందజేశారు.