మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే సమాచారం ఇవ్వాలని, బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ భీమలింగ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 మద్యం షాపులు ఉన్నాయని, నిర్వాహకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించాలని అన్నారు. ఎమ్మాఆర్పీ ధరలకు మించి అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.