ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి మదనపల్లిలో మరణించినట్లు మదనపల్లి రెండో పట్టణ సిఐ రామచంద్ర తెలిపారు. సింగరాయకొండ సెల్ టవర్ వీధిలో నివాసం ఉంటున్న నజీర్ అహ్మద్ (66) మదనపల్లి బస్సు స్టాండ్ లో చనిపోయినట్లు సమాచారం అందడంతో బుధవారం వెళ్లి మృతదేహాన్ని పరిశీలించామని తెలిపారు. మృతుని జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించామని ఆయన తెలిపారు.