తుళ్ళూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం. తుళ్ళూరు గ్రామానికి చెందిన బండారు ఏసురత్నం (30) భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో తుళ్ళూరు శివారులో మద్యం సేవించి చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు స్థానికులతో కలిసి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.