ఎస్ఎన్ పాడు: గ్రామాల అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం కృషి
పల్లె గ్రామాల అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ఎస్ఎన్ పాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలో రూ. 20 లక్షలతో సిసి రహదారి నిర్మాణం చేపట్టగా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, యువత అభ్యున్నతికి, మహిళల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.