పర్చూరు మండలం చెరుకూరు గ్రామ శివారులోని పొలాలలో పేకాట ఆడుతున్న నలుగురిని మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2500 రూపాయల నగదును స్వాధీన పరుచుకున్నారు. పక్కగా అందిన సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేయగా వీరు దొరికారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మండలంలో ఎక్కడా జూద కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని పోలీసులు హెచ్చరించారు.