పర్చూరులో జాతీయ రహదారి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీరాల నుంచి పర్చూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో దారి మళ్లింపు అర్థం కాక బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడ్డారు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై మాలాద్రి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.