మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ పుణ్య క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ. 100 కోట్లు అవసరమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. అసెంబ్లీలో మంగళవారం దేవాదాయ శాఖ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోటప్పకొండ తిరణాళ్లను రాష్ట్ర పండగ ప్రకటించిందని, అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.