ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అప్డేట్ చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని సోమవారం కోరారు. గుంటూరు, కాకినాడ, కర్నూలు, వరంగల్, తిరుపతి మెడికల్ కళాశాలలు నిర్మించి 50 సంవత్సరాలు అవుతుందన్నారు. నూతనంగా వచ్చిన టీచింగ్ హాస్పిటల్స్ కు సమానంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సిటీ స్కాన్, ఎంఆస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు.