ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి. సుజన కుమారి అనే దివ్యాంగురాలు ఆదివారం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్లో గత పదేళ్లుగా హెల్పర్ గా పనిచేస్తున్న తనను 3 నెలల క్రితం తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు.