గుంటూరు నగరంలోని 10వ వార్డు అధికార పార్టీ ప్రెసిడెంట్ పై మహిళలు గురువారం పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. గతంలో ఇలాంటి విషయంలో మహిళలు అతడిని చెప్పుతో కొట్టామన్నారు. అయినప్పటికీ అతనిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మహిళలు తెలిపారు.