గుంటూరు: యానాది కాలనీ వాసులకు ప్రత్యామ్నాయం చూపాలి

78பார்த்தது
ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాతే యానాది కాలనీలో ఇళ్లను కూల్చివేయాలని దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది బుధవారం యానాది కాలనీలో ఇళ్లు తొలగించడానికి ప్రయత్నించిన నేపథ్యంలో దళిత బహుజన సంఘాల నాయకులు అక్కడకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఇళ్లను కూల్చివేయాలనుకుంటే మరో మారు చర్చించాల్సిందేనని వారు స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி