బాపట్ల జిల్లా చీరాల సముద్రతీర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం సముద్రతీరప్రాంతాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఎమ్మార్వో గోపీ కృష్ణలు వాడరేవు బీచ్ వద్ద భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. చీరాల పర్చూరు, చిలకలూరిపేట ప్రాంతాల నుండి తీరంలో స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.