విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరి తాళ్లు అయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శనివారం సాయంత్రం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్తు చార్జీల భారం పడుతుందని రవికుమార్ విమర్శించారు.