పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ. 5లక్షల చొప్పున మంజూరు చేయాలని సీపీఐ నియోజకవర్గ ఏరియా కార్యదర్శి వెంకట్రాములు, కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం వేంపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఈనెల 17న జరిగే ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలన్నారు.