టపాసులు విక్రయాలకు అనుమతి పొందిన దుకాణదారులు నిర్దేశిత ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు పాటిస్తూ విక్రయాలు జరుపుకోవాలని ఆర్డీవో భాను శ్రీ దుకాణదారులకు ఆదేశించారు. బుధవారం పులివెందుల లో ఏర్పాటు చేసుకున్న దుకాణాల ఆమె పరిశీలించారు. ప్రతి బాణసంచా దుకాణం వద్ద అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలతో పాటు నీళ్ల డ్రమ్ములు ఇసుక బకెట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.