18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వాహనాల లైసెన్స్ పొందొచ్చని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. వి. ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక ఎంవీఐ కార్యాలయంలో ఆయన లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వాహన పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.