తాను ఎప్పటికీ అండగా ఉండి అందుబాటులో ఉంటానని, ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. పులివెందులలో బుధవారం ఉదయం వైయస్సార్ సిపి రాష్ట్ర నాయకులు సాయినాథ్ శర్మ వర్గీయులను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడి భరోసా కల్పించారు.