మైదుకూరు మండలంలోని ఆదిరెడ్డిపల్లె సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కు చెందిన టిప్పర్ ఆదివారం విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. దీంతో ట్రాన్స్ఫార్మర్ ఉన్న స్తంభంతో పాటు పలు స్తంభాలు ఒరిగి పోవడంతో వ్యవసాయ బోర్లకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. అధికారులు పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. పంటలకు నీరు పారించలేక పోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.