బసినికొండలో ప్రైవేటు ఫైనాన్షియర్ వేధింపులు తాళలేక వ్యక్తి విషయం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బుధవారం మదనపల్లి తాలూకా పోలీసుల తెలిపారు. బసినికొండలో ఉండే నరసింహులు (36) ఓ ప్రైవేటు కంపెనీలో 10 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. వారం వారం ఫైనాన్షియరుకు అప్పు చెల్లించలేదని వేధించడంతో నరసింహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.