కడప పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల చివరి వరకు 30 పోలీసు యాక్టు అమల్లో ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే 24 గంటల ముందు లిఖితపూర్వకంగా పోలీసు వారికి అర్జీ ఇచ్చి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.