తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో రూ. ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కలదని చెన్నూరు మండల కన్వీనర్ కల్లూరు భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఐటిడిపి సభ్యుల ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని సరస్వతీ నగర్, కొందపేటలో
తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అతికారి విశ్వం, ఐటిడిపి సభ్యులు బిట్టి అది, మణికంఠ, కాంత్ తదితరులు పాల్గొన్నారు.