మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. పోరుమామిళ్ల పట్టణంలోని ప్రధాన రహదారి వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు గుర్తించి ఫైన్ వేశారు. త్రిబుల్ రైడింగ్, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.