అనంతపురం జిల్లాలో వజ్రకరూరు మండలం రూపానాయక్ తండా గ్రామపంచాయతీ ధర్తీ ఆవాజ్ యోజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కి ఎంపికైన సందర్భంగా బంజారా సంఘం ప్రతినిధి ఎస్. కె. సుబ్రహ్మణ్యం నాయక్ బుధవారం మాట్లాడారు. గిరిజన గ్రామంలో సంతృప్తికరమైన సేవలను అందించడం, భర్తీ చేయడం, మారుమూల వెనుకబడిన గిరిజన ప్రాంతాలకు కీలకమైన సేవలు విస్తరింప చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు.