గరుడ చెడు మీనహళ్లి సమీపంలో ఉన్న కల్వర్టు పై గుంత ఏర్పడింది. గత రెండు నెలలుగా ఈ కల్వర్టు రోడ్డు మీదు గుంతలు పడిన పట్టించుకునే వారే కరువయ్యారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మీద బస్సులు, ఆటోలు, లారీలతో పాటు రోజు వందలాది వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.