తాడిపత్రి మండలంలోని గోసువారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న నాటుసారా తయారీ కేంద్రంపై గ్రామీణ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బందితో కలిసి గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. సిబ్బందితో కలిసి గ్రామ పొలాల్లో తనిఖీలు చేయగా నాటుసారా తయారు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అక్కడ సుమారు 100 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, వాటిని తయారు చేస్తున్న గంగరాజును అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.