వర్షాలకు పంట నష్టం చెందిన రైతులను ఆదుకుంటామని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తెలిపారు. శనివారం తన నియోజకవర్గంలోని మండలాల తహశీల్దార్లు, వ్యవసాయాధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పలు గ్రామాల్లో వర్షం వల్ల ధాన్యం తడిచి, పంటలు నేలవాలిపోయాయని రైతులు తెలిపారు. అందువల్ల, పంట నష్టం జరిగిన ప్రతి రైతు పేరు నమోదు చేసి, అంచనా వేసి నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు.