భారతరత్న, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఎంతో ఆదర్శనీయమైనదని జిల్లా కలెక్టర్ టి. ఎస్. చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన్ హాల్ లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్బంగా మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.