మంత్రి సత్య కుమార్ యాదవ్ ఈనెల 15వ తేదీన ధర్మవరం రానున్నట్లు డిపిఆర్ఓ కార్యాలయ వర్గాలు గురువారం ప్రకటనలో తెలిపారు. 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలోని పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. 15వ తేదీ ధర్మవరంలో పర్యటిస్తారు. 16 న పుట్టపర్తి లో జరిగే ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 17వ తేదీ సాయంత్రం 6: 30 కు అనంతపురం నుంచి రైల్లో విజయవాడకు వెళ్ళనున్నారు.