గృహ నిర్మాణ లబ్దిదారులకు ఎమ్మెల్యే ఫోన్ కాల్
మడకశిర నియోజకవర్గంలో గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆదివారం మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు స్వయంగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. హౌసింగ్ బిల్లుల గురించి ఆరా తీసి ఎవరైనా లంచాలు అడిగితే తనకు ఫోన్ చేయాలని లబ్ధిదారులకు సూచించారు.