మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, గుండుమల తిప్పే స్వామి ఆధ్వర్యంలో సోమవారం యాదవ కళ్యాణమంటపం లో అమర్ రాజా కంపెనీ వారు మడకశిర నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా లో దాదాపు 160 మందిని ఎంపిక చేసుకున్నారు. ఎంపికైన విద్యార్థులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గుండుమల తిప్పేస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.