రొళ్ళ: పాఠశాల సముదాయాల పునర్వ్యవస్థీకరణలో రద్దయిన సముదాయాల అనుబంధ సీఆర్పీలకు భరోసా కల్పించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో విద్యాశాఖను కోరారు. మాతృ మండలాల్లోనే విధులు కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్ఎంటీగా పేరు మారుస్తూ మండల విద్య కార్యాలయాలకు సీఆర్పీలను అనుబంధం చేస్తూ వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వు 65 కు అనుసరణ ఉత్తర్వులిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.