మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విజయవాడలోని 55వ డివిజన్ లో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి వరదలతో సర్వం కోల్పోయిన వారికి నిత్యవసర సరుకులతో పాటు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2500 మందికి చీరలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం రాష్ట్రంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి ఎవరికీ తోచిన సహాయం వారు చేయాలని ఆయన కోరారు.