మడకశిర నియోజకవర్గంలో వడి శీలమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మ వారిని మహాలక్ష్మిరూపంలో అలంకరణ చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఆరవ రోజున అమ్మవారు లక్ష్మీదేవిగా దర్శనం కల్పించారు. వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి, అర్చనలు మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.