కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కుల వివక్షతను రూపుమాపాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షుడు చెలమప్ప, వన్నూరు స్వాములు కళ్యాణదుర్గం ఆర్డీవోకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంబదూరులో కురాకులపల్లి, జల్లిపల్లి, బ్రహ్మసముద్రం మండలంలోని పిల్లలపల్లి తదితర గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి ఉందని తెలిపారు.