కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో పింఛన్ పంపిణీని 95 శాతం పూర్తి చేసినట్లు పంచాయతీ కార్యదర్శి నవీన్ తెలిపారు. ఉదయం నుంచి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచన మేరకు శుక్రవారం గ్రామ
టీడీపీ నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి ఇళ్ల వద్దకే వెళ్లి నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచు మల్లికార్జున, గ్రామ సీనియర్ నాయకులు మారెన్న, రంగారెడ్డి, పాల్గొన్నారు.