హిందూపురంలోని సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి మానిపాటి శ్రీధర్ శనివారం తనిఖీ చేశారు. ఆయన జైలులోని పరిసరాలను, నేరస్తుల గదులను, జైలులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నేరస్తులతో మాట్లాడుతూ క్షనికావేశంలో నేరాలు చేసి జైలుకు రావడం వల్ల పనికి మానసిక ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని సూచించారు.