హిందూపురం: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి...

69பார்த்தது
హిందూపురం: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి...
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హిందూపురం పట్టణంలో ప్రభుత్వ ఎంజీఎం పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు అందించే బియ్యం సరిగా లేదని, అన్నం మొత్తం ముద్దగా అవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆఫ్రిద్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி