గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని బండి మోటు వీధిలో డ్రైనేజీ కాలవలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను మునిసిపాలిటీ అధికారులు గురువారం జెసిబితో తొలగించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం దృశ్య డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాల వల్ల వర్షపు వరద నీరు ముందుకు సాగడం లేదన్నారు. దీంతో డ్రైనేజీ కాలువపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామన్నారు.