గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలోని జిల్లా సరిహద్దు వద్ద గురువారం అహుడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని తొలిసారిగా జిల్లాకు వస్తున్న అహుడ చైర్మన్ టీసీ వరుణ్ కు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన బాట సుంకులమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు టీసీ వరుణ్ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు.