అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 321 అర్జీలను స్వీకరించామన్నారు. త్వరలోనే స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు.