అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 20 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19కి సంబంధించి షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ లక్ష్మీనారాయణ మంగళవారం తెలిపారు. 20న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో హ్యాండ్ బాల్ గేమ్స్, 22న నారాయణ టెన్నిస్ అకాడమీలో టెన్నిస్ సాఫ్ట్ పోటీలు, 23న జూనియర్ కాలేజీలో త్రో బాల్, టెన్నికాయిట్, 24న సైక్లింగ్, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.