అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి 63 అర్జీలు వచ్చినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత మండలాల పోలీసు సిబ్బందికి పంపించారు. గడువులోపు బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.