ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా (మైనార్టీ అఫైర్స్) నియమితులైన మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్ ని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బుధవారం కలిశారు. విజయవాడలో ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు.